గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ పనుల్లో జాప్యం, నిర్లక్ష్యానికి తావు లేదని.. ఆ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై... మంత్రి సమీక్ష నిర్వహించారు. అలక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించిన మంత్రి... పనుల వేగం ఖచ్చితంగా పెరగాల్సిందేనని తెలిపారు. 2016లో మంజూరైన పనులు ఇంకా కొనసాగడం పట్ల...ఇంజినీరింగ్ విభాగంపై దురాభిప్రాయం నెలకొందన్న మంత్రి... పనులు ఆలస్యమవుతాయనే కారణంతోనే.. ఇటీవల దాదాపు వంద కోట్ల పనులను ఇతర శాఖలకు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు.
గిరిజన సంక్షేమశాఖలో పనులు ఆలస్యం కావద్దనే... అడిగిన వెంటనే సీఎం నిధులు ఇస్తున్నారని... అలాంటపుడు పనులు జాప్యం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. జిల్లాల్లో నిర్మిస్తున్న వాటికి సంబంధించి... ఏవైనా సమస్యలు వస్తే... వెంటనే సంబంధిత అధికారులతో సంప్రదించి.. పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని కొమురం భీం, సేవాలాల్ భవనాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలిపారు.
ఇదీ చూడండి : ఐదు రోజులు... ఆరు హత్యలు...