రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ప్రధానంగా ఉత్తర, తూర్పు తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపారు. దీనికి అనుబంధంగా 7.6. కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించిన ఉపరితల ఆవర్తనంతో పాటు తూర్పు, పశ్చిమ గాలుల మధ్య అస్థిరత ఉన్నట్లు పేర్కొన్నారు. వీటి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని రాజారావు వెల్లడించారు. బుధవారం పగలు 371 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి.
ఇదీ చూడండి : పోలీస్ వాళ్లందరికీ ఆయనే స్ఫూర్తి: డీజీపీ