Traffic Police special drive: ఇకపై నగరంలో కారు అద్దాలపై బ్లాక్ ఫిల్మ్ వినియోగించే వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించనున్నారు. ఇప్పటికే సాధారణ తనిఖీలు భాగంగా బ్లాక్ ఫిల్మ్ వాహనదారులపై జరిమానాలు విధిస్తున్నారు. జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసుతో మరింత కఠినంగా అమలు చేయనున్నారు. దీనికోసం ఈ నెల 18 నుంచి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కార్యాచరణ రూపొందించారు.
కార్లకు బ్లాక్ ఫిల్మ్, టెంటెడ్ గ్లాస్ పెట్టుకున్నా, సరైన నెంబర్ ప్లెట్ లేకున్నా చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సరైన విధానం నెంబర్ ప్లేట్ అమర్చుకోకపోయినా జరిమానా విధించనున్నారు. వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించుకున్న నెలలోపు శాశ్వత నమోదు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లతో తిరిగితే మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గత నెల 28న జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై నిందితులు ఇన్నోవా వాహనంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇన్నోవా వాహనం 2019లో కొనుగోలు చేసినా.. ఇప్పటికీ తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తోనే తిరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇన్నోవా వాహనానికి బ్లాక్ ఫిల్మ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ తరుణంలో ట్రాఫిక్ పోలీసులు ఈ తరహా వాహనాలపై జరిమానా విధించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
ఇవీ చదవండి: TS Genco: బకాయిలపై హైకోర్టుకు టీఎస్ జెన్‌కో.. ఏపీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు
తమిళనాడు ధర్మపురిలో అపశ్రుతి.. భక్తులపై పడ్డ రథం.. ముగ్గురు మృతి