ETV Bharat / state

Hyderabad Telangana Election Result 2023 LIVE : గోషామహల్‌లో రాజాసింగ్ హ్యాట్రిక్ - రాజధానిలో బీజేపీ బోణీ - Goshamahal BJP Candidate Raja Singh Win

Hyderabad Telangana Election Result 2023 LIVE : శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలన్నీ రాజధాని చుట్టూనే సాగాయి. హైదరాబాద్ జిల్లాపై పట్టు సాధించేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులూ ఒడ్డాయి. మొత్తం 15 నియోజకవర్గాలు ఉండగా, గోషామహల్​ నియోజకవర్గంలో బీజేపీ బోణీ కొట్టింది. ముచ్చటగా మూడోసారి రాజాసింగ్ విజయభేరి మోగించారు.

Goshamahal BJP Candidate Raja Singh Win
Hyderabad Telangana Election Result 2023 LIVE
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2023, 2:55 PM IST

Updated : Dec 3, 2023, 9:49 PM IST

Hyderabad Telangana Election Result 2023 LIVE : శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాపై పట్టు సాధించేందుకు అన్ని పార్టీలు ఆసక్తి పోరును కనపరిచాయి. జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉండగా, గోషామహల్​ నియోజకవర్గం నుంచి బీజేపీ బోణీ కొట్టింది. ఈ దఫా ఈ నియోజకవర్గంలో ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీకి దూరంగా ఉన్నా, ప్రధాన ప్రత్యర్థులగా బీఆర్ఎస్(BRS Party) నుంచి నందకిశోర్​వ్యాస్ బిలాల్, కాంగ్రెస్ పార్టీ నుంచి మొగిలి సునీత పోటీలో నిలిచారు. వీరందరినీ ఓడిస్తూ బీజేపీ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయాన్ని కైవసం చేసుకున్నారు.

2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ పక్కా- కాంగ్రెస్​కు ఇదే పెద్ద గుణపాఠం!: మోదీ

2018 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పట్టం కట్టిన ఏకైక నియోజకవర్గం గోషామహల్. ఆ నియోజకవర్గానికి ప్రాతినధ్యం వహించిన రాజాసింగ్ వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించి, తాజా ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. రాజాసింగ్​పై అనేక ఆరోపణలు వచ్చి, పార్టీ ఏడాది పాటు సస్పెండ్(Party Suspend) చేసినప్పటికీ అనూహ్యంగా పార్టీ టిక్కెట్ ఇచ్చి ఆయనకే అభ్యర్థిగా ప్రకటించింది.

MLA Raja Singh Winning in Goshamahal : గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా మూడోసారి రాజాసింగ్ గెలుపుతో, కోఠి మహిళా విశ్వవిద్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. భారీ ఎత్తున్న అభిమానుల చేరుకోవడంతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయం(Koti Women's University) నుంచి దూల్​పేట్ వరకు ర్యాలీగా వెళ్లడంతో కోఠి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్థంబించింది. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ, గోషామహల్​లో 3వసారి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ ఎన్నికల్లో వారసుల హవా- గెలిచిందెవరు? ఓడిందెవరు?

తనను ఓడించేందుకు మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టారని, ఒక్కొక్క ఓటుకు రూ.5000 ఇచ్చి కొనాలని చూశారని పేర్కొన్నారు. గతంలో కంటే ఇప్పుడు అసెంబ్లీలో ఎక్కువ మంది ఉన్నామని ప్రజల సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడుతామన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే కేంద్ర రాజకీయాలలోకి వస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఇచ్చిన హామీలు ఆమోదయోగ్యమైనవి కావని, అవి అమలు చేస్తే రాష్ట్రం ఇంకా అప్పులపాలు అవుతుందన్నారు. తనపై నమ్మకంతో హ్యాట్రిక్ విజయాన్ని ఇచ్చిన గోషామహల్ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

BJP Election Strategy in Telangana : రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ ఆశించిన స్థానాలు దక్కకపోయిన మెరుగైన ఫలితాలు సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో 118చోట్ల పోటీ చేసి 105చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటును మాత్రమే గెలుచుకున్న బీజేపీ కేవలం 7 శాతం ఓట్లనే తెచ్చుకుంది. 2023 ఎన్నికల్లో ఎనిమిది సీట్లలో గెలుపొందడంతో పాటు దాదాపు 15 శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది.

Telangana Women MLAs List : తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మహారాణులు వీరే - ఎంతమంది మహిళలు గెలిచారో తెలుసా?

బీసీ ముఖ్యమంత్రి నినాదం, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత, అగ్ర నేతల ప్రచారం, కేంద్ర సర్కార్(Central Government) పథకాలు, బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు, హిందుత్వ ఎజెండా కారణంగా చెప్పుకోవచ్చు. బండి సంజయ్​ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించకపోతే 20 నుంచి 25 సీట్లలో బీజేపీ గెలిచి కింగ్ మేకర్ అయ్యేదని కాషాయ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telangana Assembly Election Results 2023 Live Updates : తెలంగాణలో హస్తానిదే అధికారం - కాంగ్రెస్​ గెలుపునకు దారితీసిన అంశాలివే

ప్రజాతీర్పు- బీజేపీ ట్రిపుల్‌ ధమాకా- మూడు రాష్ట్రాల్లో కమలం సునామీ

Last Updated : Dec 3, 2023, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.