ETV Bharat / state

సూడాన్​లో సేవలందించిన హైదరాబాదీ పోలీస్​

సౌత్ సూడాన్ వ్యవస్థల బలోపేతంలో భాగంగా... శాంతి భద్రతల పరిరక్షణకు ఐరాస ప్రత్యేక మిషన్​ను నిర్వహిస్తోంది. అందుకోసం భాగస్వామ్య దేశాల నుంచి పోలీస్, మిలటరీ విభాగాలకు చెందిన అధికారులను ఎంపిక చేసి... సూడాన్​లో సేవలందించేందుకు పంపుతోంది. అందులో భాగంగా ఆ దేశంలో ఏడాది పాటు విధులు నిర్వహించారు.... హైదరాబాద్​కు చెందిన పోలీస్ అధికారిని పద్మారెడ్డి. సౌత్ సూడాన్​లో విజయవంతంగా బాధ్యతలు పూర్తిచేసి... ఇటీవలే నగరానికి చేరుకున్న పద్మారెడ్డి అక్కడి అనుభవాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

Hyderabad Police padma reddy, UN Special Mission on hyderabad police
సూడాన్​లో సేవలందించిన హైదరాబాదీ పోలీస్​
author img

By

Published : Apr 8, 2021, 2:29 PM IST

సూడాన్​లో సేవలందించిన హైదరాబాదీ పోలీస్​

సౌత్‌సూడాన్‌లో శాంతి, అహింస స్థాపన కోసం ఐరాస మిషన్‌లో భాగంగా.. వివిధ రాష్ట్రాల నుంచి అధికారుల ఎంపిక చేశారు. భారత్‌ నుంచి తనతో సహా ఐదుగురు మహిళా అధికారులు ఎంపికయ్యారు. 24 ఫిబ్రవరి 2020 నాడు తాను సూడాన్‌కు వెళ్లామని ఆమె పేర్కొన్నారు. మిషన్‌లో భాగంగా సౌత్‌సూడాన్‌లో ఏడాది పాటు విధులు నిర్వహించినట్లు వెల్లడించారు. అక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితులపై అవగాహన కల్పించామని అన్నారు.

''2011లో సూడాన్‌ నుంచి సౌత్‌సూడాన్‌ వేరుగా ఏర్పడింది. ఆ సమయంలో అంతర్గతంగా గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలో పలు గిరిజన తెగలు వలసలు వెళ్లాయి. వలస వెళ్లిన వారి కోసం ఐరాస ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసింది. ఇలాంటి ఐడీపీ క్యాంపులకు ఐరాస మమ్మల్ని పంపించింది. నేను వెళ్లిన ఐడీపీ క్యాంపులో 17 వేల మంది ఉండేవారు. క్యాంపుల్లోని ప్రజల సమస్యలపై ఫిర్యాదులు వస్తుంటాయి. ఛార్జిషీట్‌, విచారణ విషయంలో అక్కడి పోలీసులకు మార్గనిర్దేశం చేస్తాం. అక్కడి వ్యవస్థల ఏర్పాటు ఇంకా ఆరంభదశలోనే ఉంది. వాటి బలోపేతం కోసమే ఐరాస కార్యాచరణ చేపట్టింది.''

- హైదరాబాద్ పోలీస్​ అధికారిని పద్మారెడ్డి

ఇదీ చూడండి : ఆర్టీపీసీఆర్‌ పరీక్షలపై హైకోర్టు అసంతృప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.