ETV Bharat / state

'హైదరాబాద్​లోని ఆ ప్రాంతాల్లో నీళ్లు రావు' - పైపులైనుకు మరమ్మత్తులు

భాగ్యనగరంలో మంచినీరు సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2 ప్రధాన పైపులైనుకు మరమ్మత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 31న ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా ఉండదని జలమండలి అధికారులు తెలిపారు.

Hyderabad Metropolitan Water Supply announced October 31st and next day some areas no water
'హైదరాబాద్​లోని ఆ ప్రాంతాల్లో నీళ్లు రావు'
author img

By

Published : Oct 28, 2020, 6:58 PM IST

హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2 ప్రధాన పైపులైనుకు మరమ్మతులు చేప‌డుతున్న కార‌ణంగా మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు పేర్కొన్నారు. ఈనెల 31న ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఈ మరమ్మతు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఆ కారణంగా 24 గంటల పాటు మంచినీటి సరఫరా జరగదని అధికారులు వెల్లడించారు.

మెహదీపట్నం, కార్వాన్, లంగర్ హౌస్, హుమాయన్ నగర్, ఆసిఫ్ నగర్, షేక్‌పేట్, ఓయూ కాలనీ, టోలిచౌకి​, మల్లెపల్లి, విజయ్​నగర్ కాలనీ, భోజగుట్ట, జియాగూడ, రెడ్ హిల్స్, సచివాలయం, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, గగన్ మహల్, హిమయత్ నగర్, బుద్వేల్, హైదర్‌గూడ, రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, అత్తాపూర్, చింతల్‌మెట్, కిషన్‌బాగ్, గంధంగూడ, కిస్మత్ పూర్ ప్రాంతాలతోపాటు పరిసర ప్రాంతాల్లోని కాలనీల్లో ప్రజలకు నీటి సరఫరా నిలిచిపోతుందని అధికారులు వివరించారు.

ఇదీ చూడండి : అధిక వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.