golden lotus for shirdi sai షిర్డీ క్షేత్రంలో భక్తుల కోసం వెలసిన దైవం సాయిబాబా. తాము పిలిస్తే పలికే దైవం అని భక్తులు నమ్ముతుంటారు. తనని దర్శనం చేసుకునే భక్తుల కోర్కెలను తీరుస్తాడని వారి విశ్వాసం. తాము కోరిన కోర్కెలు నెరవేరినప్పుడు.. భక్తులు హృదయపూర్వకంగా ఆలయానికి వచ్చి సాయిబాబాను దర్శించుకుని... తమ స్థాయికి తగినట్లు కానుకల రూపంలో బాబాకు సమర్పిస్తారు. హుండీలో డబ్బులు, నగదు, బంగారం వంటి వాటిని బాబాకు భక్తి పూర్వకంగా ఇస్తుంటారు.

ఈ ఏడాది కూడా 2023లో కూడా షిర్డీ సాయిబాబాకు కానుకలు వెల్లువెత్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తురాలు బంగారు కమలాన్ని బాబాకు కానుకగా ఇచ్చారు. షిర్డీ సాయికి స్వర్ణ కమలం విరాళంగా అందజేశారు. 233 గ్రాముల బంగారం (రూ. 12,17,425 విలువ)తో హైదరాబాద్‌కు చెందిన నాగం అలివేణి బంగారు తామర పుష్పాన్ని తయారు చేయించి.. సాయిబాబా సంస్థాన్‌కు అందజేశారు. మధ్యాహ్న హారతి సమయంలో వీటిని సాయిబాబా వస్త్రంపై ఉంచారు. సాధారణ హారతి సమయంలోనూ వీటిని బాబా వస్త్రంపై ఉంచనున్నట్టు సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జాదవ్ తెలిపారు.
ఇవీ చూడండి: