Hyderabad CP Kothakota Srinivas Reddy Warning on Drug Mafia : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వార్షిక నేర గణాంకాలను సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. 2022తో పోలిస్తే ఈ ఏడాది 2శాతం నేరాలు పెరిగాయని, మహిళలపై నేరాలూ ఎగబాకాయని ఆయన తెలిపారు. సైబర్ నేరాలు(Cyber Crimes) 2022లో 292 కేసులు రాగా, ఈ ఏడాదిలో 344 కేసులు నమోదైనట్లు సీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అదేవిధంగా సైబర్ నేరాల్లో ఈ ఏడాది రూ.133 కోట్లు కాజేశారని ఆయన వివరించారు.
రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడిపై టీఎస్‌న్యాబ్ ఫోకస్ - బ్రీత్ ఎనలైజర్ తరహా కిట్లతో తనిఖీలకు సమాయత్తం
ఈ సంవత్సరం మొత్తంగా క్రైమ్ రెండు శాతం పెరిగింది. అందులో హత్యలు తగ్గాయి. 79 శాతంగా ఉన్నవి 64శాతానికి తగ్గుతూ వచ్చాయి. అయితే 12శాతం మహిళలు పట్ల క్రైమ్ రేటు పెరింగింది. అత్యాచారం కేసులు 19శాతం పెరగగా, మరికొన్ని టెక్నికల్ కేసులు ఉన్నాయి. అలానే 11శాతం సైబర్ క్రైములు పెరిగాయి. ఇలా మొత్తంగా చూసుకుంటే రెండు శాతం పెరిగింది.-కొత్తకోట శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ సీపీ
Hyderabad Commissioner Targets Drug Mafia : ఆర్థిక నేరాలు, భూ ఆక్రమణ కేసుల పెరిగాయని, రాబోయే రోజుల్లో ఇలాంటి నేరాలపై ఉక్కుపాదం మోపుతామని సీపీ శ్రీనివాస్‌రెడ్డి తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టంచేశారు. మాదకద్రవ్యాల కట్టడికి నార్కోటిక్ బ్యూరో కృషి చేస్తోందన్నారు.
డ్రగ్స్‌ను గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్‌ను(Sniffer Dogs) వినియోగిస్తున్నామని, కొత్త సాంకేతితను పెంచుకుంటామని వివరించారు. పోలీసుల పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ ప్రమేయం లేకుండా చూస్తామని సీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేరాల్లో ప్రమేయం ఉన్న 8మంది పోలీసులపై ఈ ఏడాది కేసులు నమోదు చేశామని, ఏడుగురిని ఉద్యోగంలోంచి తీసేశామని వివరించారు.
పబ్బుల్లో డాగ్స్‌తో పోలీసుల తనిఖీలు - పట్టుబడితే కష్టమే మరీ
Hyderabad CP on Drug Mafia : హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈఏడాది 63 శాతం నేరస్థులకు శిక్షలు పడ్డాయని, ఇందులో 13మందికి జీవిత ఖైదు పడిందని తెలిపారు. కొత్త సంవత్సర వేడుకలు రాత్రి ఒంటి గంట లోపే జరుపుకోవాలని, నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
ఈ ఏడాదిలో మొత్తంగా 5624 కేసులు నమోదయ్యాయి. అందులో ఆర్థిక నేరాలు, హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, భూ ఆక్రమణలు, నకిలీ కరెన్సీ పత్రాలు, జాబుల కల్పన పేరిట కుంభకోణాలు, కాపీరైట్ చట్టం, వ్యక్తిగత మోసాలు మొదలగునవి ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే మరోవైపు అతి ప్రమాదమైనది డ్రగ్ మాఫియా. దీనిలో ఎవరు ఉన్నా వెతికి పట్టుకొని వారికి శిక్షిస్తాం.-కొత్తకోట శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ సీపీ
భాగ్యనగరంలోకి న్యూ ఇయర్ డ్రగ్స్ - అడుగడుగునా నిఘాతో పోలీసుల స్పెషల్ డ్రైవ్
సచివాలయంలో సీఎం వరుస సమీక్షలు - రైతుబంధు నిధుల విడుదల, డ్రగ్స్ నియంత్రణకు ఆదేశాలు