ETV Bharat / state

'నువ్వు లేక నేను లేను'.. అంటూ భార్య చెంతకు వెళ్లిపోయిన భర్త - భరత్​ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు

Husband commits suicide as wife died in Hyderabad : ఔను.. వాళిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆనందంగా సాగిపోతున్న జీవితంలో.. ఓ రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. భార్యను 28 రోజుల కిందట ఓ డీసీఎం వాహనం బలి తీసుకుంటే.. ఆమె లేని జీవితం ఎందుకని భర్త బలవర్మణానికి పాల్పడ్డాడు. నెల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయి.. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ హృదయ విదారకర ఘటన హైదరాబాద్‌ బోరబండ పరిధి కార్మికనగర్‌లో జరిగింది.

Bharat  Mamata
భరత్​ మమత
author img

By

Published : Mar 1, 2023, 9:48 AM IST

భార్యను వీడి ఉండలేక ఆత్మహత్య చేసుకున్న భరత్

Husband commits suicide as wife died in Hyderabad: ఓ రోడ్డు ప్రమాదంలో తన భార్య మృతి చెందింది. ఆ విషయం జీర్ణించుకోలేని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వారికి పుట్టిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటన హైదరాబాద్​లో జరిగింది. కుటుంబ సభ్యలు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ బోరబండ కార్మికనగర్‌లో నివాసముంటున్న సాయన్న, భాగ్యలక్ష్మిల చిన్న కుమారుడు భరత్‌. బీహెచ్‌ఈఎల్ ఆర్టీసి డిపోలో 10ఏళ్లుగా మెకానిన్‌గా పనిచేస్తున్నాడు. మమత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. 28 రోజుల క్రితం భార్య రోడ్డ ప్రమాదంలో మృతి చెందటంతో ఆమెను విడిచి ఉండలేని భరత్‌ ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నెల వ్యవధిలో ఇద్దరిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Man commits suicide as wife died in Hyderabad: గత నెలలో భరత్‌కుమార్‌కు అనారోగ్యంగా ఉండటంతో సెలవు పెట్టేందుకు తాను పనిచేస్తున్న ఆర్టీసీ డిపోకి బయల్దేరాడు. భార్య మమత కూడా వస్తానని చెప్పడంతో కుమార్తెను కూడా తీసుకుని బయల్దేరారు. నెల రోజులు సిక్‌ లీవ్‌ అప్లై చేసి తిరిగి వస్తుండగా మూసాపేట వంతెనపై వేగంగా వచ్చిన డీసీఎం వాహనం వీరిని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

మమత అక్కడికక్కడే మృతి చెందింది. భరత్‌, చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఐతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భార్య మృతిని తట్టుకోలేకపోయిన భరత్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మమతా నువ్వు లేకుండా నేను ఉండలేక పోతున్నాను. పిల్లల్ని అక్క అన్నయ్య బాగా చూసుకుంటారు అంటూ సూసైడ్‌ నోట్ రాసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డీసీఎం డ్రైవర్‌ నిర్లక్ష్యం అందమైన కుటుంబాన్ని చిదిమేసింది.

"నా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన భార్య చనిపోయిన దగ్గర నుంచి మానసికంగా చాలా బాధపడేవాడు. ఏ రోజు సరిగ్గా నిద్ర పోలేదు. చనిపోయిన రోజు తెల్లవారుజామున 2 వరకు మెలుకువగానే ఉన్నాడు. రెండు గంటల తర్వాత గదిలోకి వెళ్లి ఫ్యాన్​కు ఉరి వేసుకున్నాడు. నేను గది బయట నుంచి పిలిచినా పలకలేదు. ఎంతకీ ఉలుకూ పలుకు లేకపోయే సరికి నాకు భయమై మా పెద్దబ్బాయికి ఫోన్​ చేశాను. వెంటనే వచ్చి కిటికీలో నుంచి చూస్తే ఫ్యాన్​కు చీర కట్టేసి ఉంది. అనంతరం తలుపులు పగలగొట్టి చూస్తే చనిపోయి ఉన్నాడు." - సాయన్న, భరత్‌ తండ్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.