ప్రభుత్వం బిల్డర్స్ వైపే ఉందని, సామాన్య ప్రజల వైపు లేదని హుడా మాజీ ఛైర్మన్ కోదండరెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌కి ఉన్న ప్రాధాన్యతని సొమ్ము చేసుకుంటున్నారే తప్ప.. ఇక్కడ ఇల్లు కట్టుకునే మధ్య తరగతి పేద ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మైహోం సంస్థకు ప్రభుత్వం వందల ఎకరాలు భూములను ఇచ్చిందన్నారు. మైహోం సంస్థ ప్రభుత్వానికి పాడి బర్రెల పనిచేస్తోందని ఎద్దేవా చేశారు.
మాటలకు చేతలకు పొంతన లేదు..
కేటీఆర్ పెద్ద పెద్ద సభలలో మాట్లాడే మాటలకు చేతలకు పొంతన లేదని కోదండరెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో సంపూర్ణమైన రెగ్యులేటరీ ఆథారిటీని నిర్మాణం చేయలేదని ఆక్షేపించారు. కేటీఆర్‌కు సంబంధించిన శాఖకు రెగ్యులేటరీ అథారిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.
ఇవీ చూడండి: నల్గొండలో రచ్చరచ్చ..ఎమ్మెల్యేల కొట్లాట..