ETV Bharat / state

హార్టికల్చర్‌ ఆఫీసర్‌ నియామక పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ప్రకటన - TSPSC Exam Time Table

TSPSC
TSPSC
author img

By

Published : Mar 28, 2023, 8:14 PM IST

Updated : Mar 28, 2023, 9:35 PM IST

20:10 March 28

హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా వేసిన టీఎస్‌పీఎస్‌సీ

Horticulture Officer Exam Postponed by TSPSC: టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ ఘటన తరువాత పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ కీలక నిర్ణయాలు తీసుకొంటుంది. ఇప్పటికే కొన్ని పరీక్షలు రద్దు చేసి మరికొన్ని పరీక్షలను వాయిదా వేసిన కమిషన్.. తాజాగా టీఎస్​పీఎస్సీ నిర్వహించే హార్టికల్చర్​ ఆఫీసర్​ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 4న జరగాల్సిన ఈ పరీక్షను.. జూన్ 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

రద్దయిన వాటికి కొత్త తేదీలు ఎప్పుడు..?: ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసు తరువాత సిట్​ అధికారుల సూచనలు మేరకు టీఎస్​పీఎస్సీ ఇప్పటికే నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ నెలలో జరగాల్సిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల పరీక్షలను సైతం కమిషన్​ వాయిదా వేసింది. తాజాగా వీటి లిస్ట్​లోకి హార్టికల్చర్​ ఆఫీసర్​ పరీక్ష కూడా చేరింది.

ఏప్రిల్‌, మేలో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించిన పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​.. ఈ క్రమంలోనే రద్దు చేసిన, వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్​ను ఈ నెలాఖరులోగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలిపింది. సాధారణంగా ఏదైనా పోటీ పరీక్షకు రెండు నెలల ముందుగా ప్రశ్నాపత్రాలు సిద్ధం చేస్తారు. రానున్న రెండు నెలల్లో జరగాల్సిన పరీక్షలకు ప్రశ్నాపత్రాలను సిద్ధం చేయడానికి కొంత సమయం పట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

TSPSC Exam Time Table: ఇప్పటికే గ్రూప్‌-4, 2 పరీక్షల తేదీలను ప్రకటించిన కమిషన్​ వీటిని అనుకున్న సమయానికే నిర్వహించాలా? అనే విషయమై కమిషన్ ఆలోచిస్తోంది. తొలుత గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి.. జులై 1వ తేదీన గ్రూప్‌-4, ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మూడింటినీ వరుసగా నిర్వహిస్తే.. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తుతాయా? సిద్ధమయ్యేందుకు సమయం సరిపోతుందా? కేంద్ర, ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టి పెట్టుకొని అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించాలని టీఎస్​పీఎస్సీ ఆలోచిస్తోంది.

ఇవీ చదవండి:

TSPSC లీకేజ్ కేసులో ముగ్గురికి 5 రోజుల కస్టడీ

TSPSC: ఏఈ క్వశ్చన్ పేపర్ ఇంకెంత మందికి విక్రయించారు..?

నాకు సిట్ నోటిసులిస్తే... అన్ని ఆధారాలు ఇస్తా.. : ఆర్​ఎస్​ ప్రవీణ్​

Last Updated : Mar 28, 2023, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.