ETV Bharat / state

ఏపీలో ఫోన్​ చేస్తే ఇంటి వద్దకే మందులు - lock down news in ap

లాక్​డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్​లో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మందులు అవసరం ఉన్నవారికి ఇళ్లకే పంపేలా ఔషధ నియంత్రణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

home delivery medicine  in ap
ఏపీలో ఫోన్​ చేస్తే ఇంటి వద్దకే మందులు
author img

By

Published : Apr 30, 2020, 4:03 PM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​లో ఇళ్ల నుంచి బయటకు రాలేని వారికి మందులను వారి ఇంటికే పంపిణీ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెడ్‌జోన్లలో ఉండి మందులు అవసరమైనప్పటికీ తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఔషధ నియంత్రణ శాఖ చెప్పిన నంబర్లు, ఈమెయిల్స్‌ ద్వారా దుకాణాల వారిని సంప్రదించి నగదుతో తెప్పించుకునేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని గుంటూరు జిల్లాలో మందుల దుకాణాల వివరాలను ఔషధ నియంత్రణ శాఖ అధికారులు వార్డు, సచివాలయ సిబ్బందికి అందచేస్తున్నారు. ఇలా గుంటూరు జిల్లాలో 81 మందుల షాపులను గుర్తించారు. ఇందులో 34 గుంటూరు నగరంలోనే ఉన్నాయి. ఇలాగే కర్నూల్​ జిల్లాలోనూ చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మందుల కొరత రానివ్వద్దు

కొవిడ్‌-19 నేపథ్యంలో సాధారణ మందులకు కొరత ఏర్పడకుండా చూడాలని జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. రక్తపోటు, చక్కెర వ్యాధి, కడుపునొప్పి, ఇతర రోగాలకు సంబంధించిన మందులను కొనుగోలుదారులకు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. 54 రకాల మందుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ఈ మందులు ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయని రాష్ట్ర అధికారులు తెలిపారు.

తగ్గిన హడావుడి!

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నెలకోసారి మందులను కొనుగోలుచేసే వారు, రెండు, మూడు నెలలకు సరిపడ మందులను కొన్నారు. ప్రస్తుతం ఈ ధోరణిలో మార్పు వచ్చింది. మందులు అందుబాటులో ఉన్నందున ప్రస్తుతం వినియోగదారుల్లో మునుపటి ఆందోళన కనిపించడంలేదు. మరోవైపు..మందులను గ్రామీణ ప్రాంతాల దుకాణాలకూ ఎప్పటి మాదిరిగానే పంపిణీ జరిగేలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పట్టణాల్లో ఉచిత మాస్కుల పంపిణీకి ఏర్పాట్లు

పట్టణాల్లోని ప్రతిఒక్కరికి మూడు ఉచిత మాస్కుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ఒకట, రెండు రోజుల్లో పురపాలక, నగరపాలక సంస్థ కమిషనర్ల ఆధ్వర్యంలో వార్డు వాలంటీర్లు తమ పరిధిలోకి ఇళ్లకు వెళ్లి వీటిని అందజేస్తారు. ఇందుకోసం సుమారు 4.40 కోట్ల మాస్కులు సిద్ధం చేశారు. పంపిణీ సందర్భంగా వాలంటీర్లు భౌతిక దూరం పాటించాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ సూచించింది.

ఇవీ చూడండి: మూడు రోజుల పాటు లాక్​డౌన్​ ఎత్తివేయండి: తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.