కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం వల్ల నగరంలో వలస కూలీలు పని లేక తిండికి అవస్థలు పడుతున్నారు. పేదల అవస్థలను గుర్తించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎన్జీవోస్ సంస్థ నేతృత్వంలో నిరుపేద కూలీలకు నెలరోజులుగా... నిత్యం వెయ్యి మంది పేదలకు నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు.
హోలిస్టిక్ ఆయుర్వేద ఆసుపత్రి యాజమాన్యం.. కూకట్పల్లి నిజాంపేట్ రోడ్డులోని హోలిస్టిక్ ఆయుర్వేద ఆసుపత్రిలో యోగా కేంద్రాన్ని గోడౌన్‌గా మార్చి నిత్యావసర సరకులను ప్యాకింగ్ చేసి నిరుపేదలు ఉన్న ప్రాంతాలకు వెళ్లి అందిస్తున్నారు. అన్నార్తులను ఆదుకునేందుకు ఆసుపత్రి ఆవరణలోనే 400 మందికి వంటలు చేసి నిత్యం అన్నదానం చేస్తున్నారు.
ఇవీ చూడండి: వలస కష్టం: కాలి నడకన 2 వేల కి.మీ ప్రయాణం