ETV Bharat / bharat

వలస కష్టం: కాలి నడకన 2 వేల కి.మీ ప్రయాణం - Coronavirus

ముంబయి నుంచి బిహార్​కు వెళ్లాలంటే.. రైలు ప్రయాణానికే రోజున్నర సమయం పడుతుంది. అన్ని గంటలు కూర్చోవాలంటేనే చాలా కష్టం. అదే కాలినడకన వెళ్లాలంటే? ఊహకే అందదు కదూ. కానీ ఈ అసాధ్యుడు రెండువేల కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన ఛేదించాడు. ముంబయి నుంచి దర్బంగాకు నడుచుకుంటూ వెళ్లి ఔరా అనిపించాడు.

two thousand
వలస కష్టం.. కాలినడకన 2వేల కి.మీ ప్రయాణం
author img

By

Published : Apr 28, 2020, 3:24 PM IST

Updated : Apr 28, 2020, 7:29 PM IST

కాలి నడకన 2 వేల కి.మీ ప్రయాణం

ఎంత దూరమైనా కాలినడకన ప్రయాణించేవాళ్లం అని తాతయ్యలు చెప్పడమే కానీ.. ఈ రోజుల్లో అలా వెళ్లేవాళ్లు చాలా అరుదు. పనికోసం ముంబయికి వెళ్లిన ఓ వ్యక్తి మాత్రం కాలినడకన రెండువేల కిలోమీటర్లు ప్రయాణించి ఔరా అనిపించాడు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు దేశంలో లాక్​డౌన్ విధించిన నేపథ్యంలో ముంబయిలో పనిలేక.. ఇంటికి వెళ్లేందుకు రవాణామార్గాలు దొరకక కాలినడకే శరణ్యమనుకున్నాడు. కట్టుబట్టలతో.. కాలినడకతో ప్రయాణం ప్రారంభించాడు. సంకల్ప బలంతో 22 రోజులపాటు నడిచి ఇల్లు చేరాడు.

బిహార్​లోని దర్బంగా జిల్లా పంచభోగ్ గ్రామవాసి హరివంశ్ చౌదరి. గత రెండేళ్లుగా ముంబయిలో ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. కరోనా వైరస్ ఆందోళన కారణంగా యజమాని అతనికి ఆశ్రయం కల్పించేందుకు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో కాలినడకన ప్రయాణం ప్రారంభించాడు హరివంశ్. మధ్యలో కొద్ది దూరంపాటు బస్సులో ప్రయాణించి మధ్యప్రదేశ్​లోని ఇటార్షి వరకు చేరాడు. అనంతరం ఏ రవాణా సాధనం దొరక్క కాళ్లకే పనిచెప్పాడు.

"నేను నా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకుని ట్రైన్ టికెట్ కొనుగోలు చేశాను. ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించారు. నా టికెట్ రద్దు అయిందని సమాచారం అందింది. ఇక నేను కాలినడకన ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మధ్యప్రదేశ్ పోలీసులకు కృతజ్ఞతలు చెప్పాలి. తినేందుకు ఆహారం ఇచ్చారు. దారి ఖర్చులకు రూ. 200 సాయం చేశారు."

-హరివంశ్ చౌదరి, బహుదూరపు బాటసారి

ఉత్తర్​ప్రదేశ్ పోలీసులు తనతో కాస్త కటువుగా వ్యవహరించారని చెప్పాడు హరివంశ్. "మీ గ్రామానికి వెళ్లేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు" అని ప్రశ్నిస్తూ కొట్టినట్లు తెలిపాడు. కరోనా వైరస్ భయంతో దారిలో ఎవరూ కనీసం మంచినీళ్లు ఇవ్వడానికైనా ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. కాలికి బొబ్బలు వచ్చాయని.. చాలాదూరం ప్రయాణించడం వల్ల నొప్పులు ఇబ్బంది పెట్టేవని చెప్పాడు.

హరివంశ్ రాకను ఊహించలేదన్నారు కుటుంబసభ్యులు. లాక్​డౌన్​ ఉన్నా ఇల్లు చేరడం ఆనందంగా ఉందని చెప్పారు.

"మా అన్నయ్యను చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాను. ఇంటికి వచ్చేందుకు ఇంత దూరం నడవడం అద్భుతమే. మేం గ్రామ సర్పంచ్​కు సమాచారమిచ్చాం. వారు అన్నయ్యను నిర్బంధంలో ఉంచారు."

-సావిత్రి, హరివంశ్ సోదరి

హరివంశ్ నమూనాలను కరోనా పరీక్షలకు పంపించారు అధికారులు. ఫలితం నెగెటివ్​గా వచ్చినప్పటికీ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్బంధంలో ఉంచారు.

ఇదీ చూడండి: విస్తృత పరీక్షలతోనే కరోనా కట్టడి- ఆలస్యం చేస్తే అస్తవ్యస్తమే!

Last Updated : Apr 28, 2020, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.