బాధితులు 100కి డయల్ చేయగా...అక్కడికి చేరుకున్న పోలీసులు హిజ్రాలను స్టేషన్కు తరలించారు. అక్కడ కూడా నానా హంగామా చేశారు. బూతులు తిడుతూ బాధితులపై మరోసారి పోలీసుల ముందే దాడి చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన రక్షకభటులను కుమ్మేశారు. బాధితుడి ఫిర్యాదుతోపాటు విధులకు ఆటంకం కలిగించినందుకు కేసు నమోదు చేశారు.
రోడ్లపై దాడులకు పాల్పడుతున్న హిజ్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులతోపాటు నగరవాసులు కోరుతున్నారు.