విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని... హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ... భారత రాష్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా... వారికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతితో జరిగిన సంభాషణ సందర్భంలో వారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విషయాల గురించి వాకబు చేశారని బండారు దత్తాత్రేయ తెలిపారు.
అలాగే వర్షాలు, వరదలతో హైదరాబాద్లో ఏర్పడిన పరిస్థితుల గురించి ఆరా తీసి... సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాల పట్ల విచారం వ్యక్తం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో... బండారు దత్తాత్రేయ అక్కడ కేంద్ర, రాష్ట్ర విపత్తు సహాయక దళాల సమన్వయముతో చేపట్టిన సహాయక చర్యల గురించి రాష్ట్రపతికి వివరించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ భూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్లతో మాట్లాడి వారికి విజయదశమి శుభాకాంక్షలు తెలపినట్లు వివరించారు.
విజయదశమి పర్వదిన రాజ్ భవన్లో గవర్నర్ బండారు దత్తాత్రేయ హిమాచల్ రాష్ట్రంలో పవిత్రంగా పూజించే దేవదారు వృక్షానికి సీతారాంచంద్రమూర్తులకు... అలాగే శక్తిస్వరూపుని అయినా దుర్గా మాతకి పూజలు జరిపి రాజ్ భవన్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నారు.
ఇదీ చదవండిః ఆర్టీసీ బస్సుల్లో ఇక భౌతిక దూరం లేదు..!