కరీంనగర్ నగరపాలక సంస్థలోని మూడు డివిజన్లపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలిపివేసింది. మూడు డివిజన్లలో ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు సరిగా లేవని.. దానివల్ల రిజర్వేషన్లపై ప్రభావం చూపిందని ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి... జనాభా లెక్కలు సరిచేశాక ఎన్నికలకు వెళ్లాలని ఈనెల7న తీర్పునిచ్చారు.
ఈ తీర్పుతో కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయలేదు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం వద్ద అప్పీల్ చేసింది. అప్పీల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణకు స్వీకరించింది. సింగిల్ జడ్జి తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి: ఏసీబీ వలలో జూబ్లీహిల్స్ ఎస్సై..