High court on Group-1 Age: గ్రూప్-1 పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 45 ఏళ్ల నుంచి 49కి పెంచాలన్న వినతులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలంటూ ఆరుగురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని తెలిపింది.
టీఎస్పీఎస్సీకి ఏప్రిల్ 26న దరఖాస్తు సమర్పించినప్పటికీ స్పందించడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో 2017 నుంచి నోటిఫికేషన్లు రానందున ఈ ఒక్కసారి గరిష్ఠ వయోపరిమితి పెంచాలని వాదించారు. తమిళనాడులో ఇదే విధంగా వయోపరిమితి పెంచారని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం వినతిపత్రాలపై నిర్ణయం తీసుకుని కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ జూన్ 17కి వాయిదా వేశారు.
ఇవీ చూడండి: తెలంగాణలో జోరుగా 'అక్షయ' అమ్మకాలు
లాభాల్లో ఉన్న సంస్థను ఆర్నెళ్లక్రితం ఏర్పాటైన సంస్థకు ఎలా అమ్ముతారు..?'