ETV Bharat / state

వలస కార్మికుల తరలింపుపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు - telangana government news

వలస, ఇటుక బట్టీ కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైల్వేతో సమన్వయం చేసుకుని పంపించే ఏర్పాట్లు చేయాలని సూచించింది. వసతి సదుపాయాలు కల్పించాలని పేర్కొంది.

High Court orders to telangana government on Migrant Labor
వలస కార్మికుల తరలింపుపై హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు
author img

By

Published : Jun 20, 2020, 10:49 AM IST

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బంగా, బిహార్‌, మహారాష్ట్రకు చెందిన వలస, ఇటుక బట్టీ కార్మికులను రైల్వేతో సమన్వయం చేసుకొని తరలించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అప్పటివరకు వారికి వసతి సదుపాయాలు కల్పించాలని పేర్కొంది.

రైలు ప్రయాణం ఖరారయ్యాక రెండు గంటల ముందు బస్సుల్లో స్టేషన్‌ వద్ద వదిలి పెట్టాలని తెలిపింది. స్టేషన్ల వద్ద రద్దీ లేకుండా పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించింది. సికింద్రాబాద్‌లోని అన్ని సదుపాయాలున్న మనోరంజన్ కాంప్లెక్స్‌లో వసతి ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాలని సూచించింది. వలస కార్మికుల తరలింపు, వసతి ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ... విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: 'చైనా కమ్యూనిస్ట్​ పార్టీ ఒక 'ధూర్త శక్తి''

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.