ఈ-వాచ్ యాప్‌ను ఈ నెల 9 వరకు వినియోగించొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇటీవలే ప్రారంభించిన ఈ యాప్‌పై పలువురు న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. ప్రైవేటు వ్యక్తులు అభివృద్ధి చేసిన యాప్‌ను ఎస్ఈసీ తీసుకువస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ అభ్యంతరాలపై... న్యాయస్థానంలో వాదనలు జరిగాయి.
భద్రతా ధ్రువపత్రం అందలేదన్న ప్రభుత్వ న్యాయవాది వాదన మేరకు... హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ధ్రువపత్రం రావడానికి మరో 5 రోజులు పడుతుందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. హైకోర్టు తదుపరి విచారణను 9కి వాయిదా వేసింది. ఈ నెల 3న ఈ-వాచ్ యాప్‌ను ఎస్ఈసీ అందుబాటులోకి తెచ్చింది.