ETV Bharat / state

అనుభవం లేని వారితో ఆర్టీసీ నడుస్తోంది: హైకోర్టులో వ్యాజ్యం - ఆర్టీసీ కార్మికుల జీతాలపై హైకోర్టులో విచారణ

ఆర్టీసీ నిర్వహణ తీరు సరిగాలేదని, అనుభవం లేనివారితో నిర్వహణ జరుగుతోందని న్యాయవాది గోపాలకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఆర్టీసీ కార్మికుల జీతాలపై హైకోర్టులో విచారణ
author img

By

Published : Nov 25, 2019, 1:22 PM IST

Updated : Nov 25, 2019, 2:24 PM IST

అర్హత, అనుభవం లేని ఆర్టీసీ డ్రైవర్లతో తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది గోపాలకృష్ణ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై ఇవాళ విచారణ జరిగింది. తాత్కాలిక డ్రైవర్లకు కనీసం 90 రోజులు శిక్షణ ఇచ్చేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ కోరారు. దీనిపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది.

మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్‌ నెల వేతనాలు చెల్లించాలన్న ఆర్టీసీ కార్మిక సంఘాల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు వినిపించేందుకు కొంత గడువు కావాలని ఆర్టీసీ తరఫు న్యాయవాది కోరారు. ఇప్పటికే పలుమార్లు సమయం తీసుకున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోసారి గడవు కోరవద్దని ఆర్టీసీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

ఇవీ చూడండి : 'కేసీఆర్​ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'

Last Updated : Nov 25, 2019, 2:24 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.