హైదరాబాద్లోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఫీజుల నియంత్రణపై సిఫార్సుల కోసం ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని నియమించి మూడేళ్లు గడుస్తున్న ఇంకా ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది.
ఎనిమిది వారాల గడువు కావాలని ఏజీ కోరగా.. రానున్న విద్యా సంవత్సరానికి పలు విద్యా సంస్థలు ఇప్పటికే ఫీజుల వసూలు మొదలు పెట్టాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఏప్రిల్ 8లోగా కమిటీ సిఫార్సులపై నిర్ణయం తీసుకోవచటంతో పాటు.. ఫీజుల నియంత్రణ కోసం సమగ్ర పాలసీ సిద్ధం చేయాలని ఆదేశించింది.
ఇదీ చదవండి : 4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం