ETV Bharat / state

ఎర్రమంజిల్ కూల్చివేతపై శుక్రవారం విచారణ - శాసన సభా నిర్మాణం వ్యవహారంపై కేసులు

సుమారు 150 ఏళ్ల నాటి అసెంబ్లీ భవనాలను కూల్చవద్దంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇవాళ విచారణ జరపాలని పిటిషనర్​ తరఫు న్యాయవాది కోరగా... ఉన్నత న్యాయస్థానం ఈనెల 28న విచారణ చేపడుతానని స్పష్టం చేసింది.

శాసనసభ నిర్మాణం
author img

By

Published : Jun 25, 2019, 5:11 PM IST

నూతన శాసనసభ నిర్మాణంపై 28న హైకోర్టు విచారణ

శాసనసభ నిర్మాణం వ్యవహారంపై ఈనెల 28నే హైకోర్టు విచారణ చేపట్టనుంది. నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్​లోని చారిత్రక భవనాలు కూల్చివేయవద్దంటూ... పీహెచ్​డీ విద్యార్థి శంకర్​ నిన్న ఉన్నతన్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. త్వరలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నందున ఇవాళే విచారణ జరపాలని పిటిషనర్​ తరఫున సీనియర్​ న్యాయవాది సత్యంరెడ్డి కోరారు. స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆర్​ఎస్​ చౌహన్​ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం నాడు విచారణ చేపడతామని తెలిపింది. ఈ భవనాలపై మరోవ్యాజ్యం కూడా దాఖలైంది. సుమారు 150 ఏళ్ల నాటి భవనాలు కూల్చివేయకుండా ఆదేశాలు జారీ చేయాలని సామాజిక కార్యకర్త సార్వత్​ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దానిపై కూడా శుక్రవారమే విచారణ జరిగే అవకాశం ఉంది.

ఇదీ చూడండి : నిరసనల సెగతో మెట్రో ఎక్కిన మంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.