High Court Division Bench on Group 1 exam cancellation : గ్రూప్-1 పరీక్ష రద్దు(Group1 Cancellation) చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) అప్పీలుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు విచారణ చేపట్టి హైకోర్టు(Telangana High Court) డివిజన్ బెంచ్.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు సబబేనని స్పష్టం చేసింది. గ్రూప్1 కేసులో సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిందేనని కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.
బయోమెట్రిక్ పెట్టకపోవడానికి తగిన కారణాలను టీఎస్పీఎస్సీ చూపలేదని హైకోర్టు తెలిపింది. మొదటిసారి బయెమెట్రిక్ పెట్టి.. రెండోసారి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. 8 నెలల్లో ఎందుకు నిర్ణయం మారిందని నిలదీసింది. రాజ్యాంగబద్ద సంస్థ ఇష్టానుసారం ఎలా వ్యవహరిస్తుందని అడిగింది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ అప్పీలును కొట్టివేస్తూ సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ.. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
TSPSC Group 1 Prelims Exam Cancelled : గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేస్తూ డివిజన్ ఇచ్చిన తీర్పుపై ఎన్ఎస్యూఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ స్పందించారు. నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) భరోసా కల్పించలేదని ఆయన ఆరోపించారు. గ్రూప్- 1 పరీక్షను టీఎస్పీఎస్సీ పారదర్శకంగా నిర్వహించలేదని విమర్శించారు. టీఎస్పీఎస్సీని రద్దు చేసి.. కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రూప్-1 నిర్వహించాలని కోరారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేంతవరకు కాంగ్రెస్ పోరాటం సాగిస్తుందని హామీ ఇచ్చారు.
Telangana Group 1 Prelims Exam : మొదటిసారి పేపర్ లీకేజీతో గ్రూప్-1 పరీక్ష రద్దు అయిందని.. మళ్లీ రెండోసారి కూడా పారదర్శకంగా నిర్వహించక గందరగోళానికి గురి చేశారని కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ విమర్మించారు. టీఎస్పీఎస్సీ బోర్డుపై నమ్మకం లేక 50 వేల మంది రెండోసారి పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ లో అర్హత సాధించలేదని అభ్యర్థులు ఎవరూ కోర్టును ఆశ్రయించలేదన్నారు. బయోమెట్రిక్ లేకుండా పరీక్ష నిర్వహించారని.. అయినా టీఎస్పీఎస్సీ పట్టించుకోలేదని వాపోయారు.
TSPSC Aspirants Confusion : గ్రూప్-1 చదవాలా.. గ్రూప్-2కు ప్రిపేర్ అవ్వాలా.. అయోమయంలో అభ్యర్థులు
కేవలం యూత్ కాంగ్రెస్ నాయకుడు నర్సింగ్‌ను అభ్యర్థులు అప్రోచ్ అవ్వడంతోనే.. కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. తమ తరఫున న్యాయవాది గిరిధర్ రావు పూర్తి ఆధారాలను అందజేశారని.. సింగిల్ జడ్జ్ వద్ద వాదనలు వినిపించడంతో ఏకీభవించి పరీక్షను రద్దు చేశారన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చిన మాట్లాడాల్సి ఉన్న.. ఆ పని చేయలేదన్నారు. డివిజన్ బెంచ్‌కు అపీల్‌కు వెళ్లారు.. కానీ మూడోసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించాలని హైకోర్టు సర్కారుకు ఆదేశించిందన్నారు. ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని కోరారు.