తన తల్లి సంతోషం కోసం హైదరాబాద్లో చిక్కుకున్న వలస కూలీలను సొంత ఖర్చులతో స్వస్థలాలకు పంపిస్తున్నట్లు కథానాయకుడు మంచు మనోజ్ తెలిపాడు. తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ మూసాపేటలో ఉంటున్న ఏపీ శ్రీకాకుళం వలస కూలీలను రెండు బస్సులు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపించాడు.
ఇళ్లకు చేరేవరకు తన మనుషులు సాాయంగా ఉంటారని కూలీలకు భరోసానిచ్చిన మనోజ్... వలస కూలీల కుటుంబాలకు మాస్క్లు, శానిటైజర్స్ అందజేసి సాగనంపాడు. వ్యక్తిగతంగా తాను ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నాడు. సామాజిక బాధ్యతగా అందరు ముందుకువచ్చి సాటి మనుషులకు సహాయపడాలని మనోజ్ విజ్ఞప్తి చేశాడు.
ఇదీ చూడండి : పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్ ట్రైబ్యునల్ స్టే