వర్షాలతో హైదరాబాద్ అల్లాడిపోతోంది. శనివారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలయమయ్యాయి. కాలనీలకు కాలనీలే నీటిలో మునిగాయి. శ్రీనగర్ కాలనీ, కమలానగర్ కాలనీల్లో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేని దుస్థితి నెలకొంది.
నిన్న రాత్రి 10.30 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పరిస్థితి దారుణంగా తయారైంది. వనస్థలిపురం నుంచి ఎల్‌బీనగర్ మీదుగా సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్ వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు గంటల కొద్ది రోడ్లపైనే ఉన్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీలు చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా కేసులు.. ఆరు మరణాలు