ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
వర్షంతో పాటు గాజులదిన్నె జలశాయం గేట్లు ఎత్తడం వల్ల హంద్రీనదీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన వర్షాలకు కల్లురులోని వక్కెర వాగు పోంగిపోర్లుతుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కర్నూలు నగరంలోనూ రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది.
ఇదీ చదవండి: నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్