ETV Bharat / state

heavy rainfall in Telangana : 40 ఏళ్ల తర్వాత ఈ వేసవిలో అధిక వర్షపాతం - ఈ సంవత్సరం తెలంగాణలో వర్షపాతం

heavy rainfall in telangana 2023: ఈ ఏడాది మండే ఎండాకాలంలో కూడా కుంభవృష్టి కురిసింది. ఏప్రిల్, మే నెలల్లో(5వ తేదీ నాటికి) కురిసిన వర్షాలు వర్షపాతం రికార్డులను మార్చేశాయి. 40 ఏళ్ల తర్వాత వేసవిలో ఈ ఏడాది అత్యంత ఎక్కువగా వర్షపాతం నమోదైంది.

rainfall in telangana 2023
ఈ సంవత్సరమే అధిక వర్షపాతం
author img

By

Published : May 9, 2023, 1:01 PM IST

Updated : May 9, 2023, 4:29 PM IST

heavy rainfall in telangana 2023: ఈ సంవత్సరం మండే ఎండాకాలం కూడా తీవ్రమైన వర్షాకాలాన్ని తలపించింది. మండు వేసవి కూడా మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. ఇబ్బడిముబ్బడిగా వానలు దంచి కొట్టాయి. ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వర్షాలు ఈ సంవత్సరం వర్షపాతం రికార్డులను మార్చేశాయి. గంత 40ఏళ్ల చరిత్రలో వేసవిలో ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో వానలు కురిశాయి. 2022-23లో (జూన్‌-మే) నమోదైన వర్షపాతం గత రికార్డులను క్రాస్ చేసింది. ఈ సంవత్సరం పడిన వర్షాలు సాధారణ వర్షపాతం కన్నా 54శాతం అధికంగా నమోదైంది. రాష్ట్ర సాధారణ వర్షపాతం 908.3 మిల్లీమీటర్లు కాగా గత సంవత్సరం జూన్ నుంచి మే 5నాటికి 1359.7 మిల్లీమీటర్లు కురిసింది. 1983-84 సంవత్సరంలో సాధారణం కంటే 51శాతం అధికంగా వానలు కురిశాయి. ఆ సంవత్సరంలో సాధారణ వర్షపాతం 892.8 మిల్లీలీటర్లకు 1351.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆ తరువాత 2022-23 సంవత్సరంలో 54.4 శాతం అధికంగా వర్షాలు నమోదయ్యాయి.

మే నెలలో.. అరుదైన రికార్డు: వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం 1951-52 నుంచి వివరాలను పరిశీలిస్తే 1989-90లో మే నెలలో మాత్రమే 577 శాతం వర్షపాతం నమోదైంది. అప్పుడు సాధారణ వర్షపాతం 25.8 మిల్లీ మీటర్లకు గాను 174.7 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం దీనికి విరుద్దంగా ఈ ఏడాది మే నెలలో సాధారణ వర్షపాతం 2.6 మిల్లీమీటర్లకు గాను ఇప్పటికే 39.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో రాష్ట్రంలో 1412 శాతం వర్షపాతం నమోదైంది. గత సంవత్సరం జులైలో 121శాతం ఎక్కువ వర్షాలు కురిశాయి. ఈ మార్చి నెలలో 413 శాతం, ఏప్రిల్​లో 338 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.

15 జిల్లాల్లో 60 శాతానికి పైగా కురిసిన వర్షాలు: ఈ సంవత్సరంలో (జూన్‌ 22- మే 23) ఖమ్మం మినహా అన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. 15 జిల్లాల్లో ఆ జిల్లా సాధారణ వర్షపాతాల కన్నా 60శాతానికి పైగా నమోదయ్యాయి. అత్యధికంగా నారాయణపేటలో 77శాతం, వనపర్తి, కరీంనగర్ జిల్లాలలో 75శాతం, మహబూబ్​నగర్​లో 74శాతం, జగిత్యాల 70, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లిల్లో 69 శాతానికి పైగా నమోదయ్యాయి. కానీ ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రమే 13శాతం మాత్రమే అధికంగా వర్షం నమోదైంది.

ఇవీ చదవండి:

Last Updated : May 9, 2023, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.