అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఫలితంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాతబస్తీ ఉస్మానియా జనరల్ ఆసుపత్రి పురాతన భవనంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ఆసుపత్రిలో ఉన్న రోగులు, వారితో ఉండే అటెండర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
ఇదీచూడండి: రాష్ట్రంలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు