ETV Bharat / state

ముగ్గురు చిన్నారులు మృతి.. మూడో దశకు ఇది సంకేతమా..?

మధ్యప్రదేశ్​లో కేవలం జలుబు చేసి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ వార్త అక్కడి ఆరోగ్య శాఖ అధికారులను కలవర పెడుతోంది. ఇది డెల్టా వేరియంట్​కు సంకేతంగా పలువురు వైద్య నిపుణులు భావిస్తున్నారు.

మూడో దశకు ఇది సంకేతమా..?
మూడో దశకు ఇది సంకేతమా..?
author img

By

Published : Jul 8, 2021, 1:19 PM IST

మధ్యప్రదేశ్​లోని పన్నా జిల్లాలో జలుబుతో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఈ వార్త మధ్యప్రదేశ్​లోని ఆరోగ్యశాఖ అధికారులను కలవర పెడుతోంది. ఇది డెల్టా వేరియంట్​కు సంకేతంగా పలువురు వైద్య నిపుణులు భావిస్తున్నారు.

ముగ్గురు పిల్లల మరణ వార్తతో జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా షాక్​కు గురైంది. దీంతో మాతా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఇతర వైద్య సిబ్బంది జిల్లాలోని పురషోత్తమపుర్​ పంచాయతీ చందమరికి చేరుకుని అక్కడ అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. వారు చేసిన ఆర్​టీపీసీఆర్​ పరీక్షల్లో అందరికి కొవిడ్​ నెగటివ్​ వచ్చింది. వారిలో జలుబుతో బాధపడుతున్న మరో 14 మంది నుంచి నమూనా సేకరించిన వైద్యాధికారులు వారి పరిస్థితిని నిరంతర పర్యవేక్షిస్తున్నారు.

అయితే జిల్లా వైద్యాధికారి చెప్పిన వివరాల ప్రకారం కేవలం ఇద్దరు పిల్లలు మాత్రమే వైరస్​తో చనిపోయారు. మరో చిన్నారి మాత్రం పోషకాహార లోపంతో మరణించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వివరించారు.

కరోనా మూడో దశ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుంది అని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. దీంతో చిన్నారుల మరణ వార్త విని మధ్యప్రదేశ్​ వైద్యాధికారులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇదీ చూడండి: 'డెల్టా వేరియంట్​పై టీకాల ప్రభావం తక్కువే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.