Minister Harish Rao: ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ మాజీ అధ్యక్షుడు, దివంగత ప్రభాకర్ విగ్రహాన్ని హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. ప్రభాకర్ మొదటి స్మారకోపన్యాస కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. దివంగత ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్న ఆయన... హైదరాబాద్కు కృష్ణా జలాలను తీసుకురావడం కోసం చాలా కృషి చేశారని అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ తెలంగాణ కోసం ఎనలేని కృషి చేశారన్న హరీశ్ రావు.. రాష్ట్ర ప్రయోజనాలను దృషిలో పెట్టుకొని పలు సూచనలు చేశారని గుర్తు చేసుకున్నారు.
ఏ విషయాన్నైనా ప్రభాకర్ నిర్మొహమాటంగా సూటిగా చెప్పేవారన్న మంత్రి.. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోనూ ఆయన సూచనలు పొందపొర్చారని తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్కు జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింప చేశారని, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ప్రతి జయంతికి ప్రభాకర్ పేరిట కార్యక్రమాలు చేపడతామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
ఇవీ చదవండి: