ETV Bharat / state

"రైతుబంధు నిధులను బకాయిలకు జమ చేస్తే ఊరుకోను" - Minister Harish Rao Latest speech

Harish Rao fire on some Bankers: ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పదో విడత డబ్బులను రైతుల ఖాతాలోకి జమ చేసింది. అయితే ఆ నగదును కొందరు బ్యాంకర్లు రైతుల బకాయిల కింద జమ చేసుకొంటున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ఈనాడులో కథనం ప్రచురించారు. దానిపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు స్పందించారు.

Harish Rao expressed his anger against some bankers
రైతుబంధు నిధులను ఎట్టిపరిస్థితిలోనూ బకాయిలకు జమ చేయరాదు
author img

By

Published : Jan 7, 2023, 12:17 PM IST

Updated : Jan 7, 2023, 12:29 PM IST

Harish Rao fire on some Bankers: రైతుబంధు నిధులను కొందరు బ్యాంకర్లు రుణాలు, ఇతర బకాయిలకు జమ చేసుకోవడంపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్​​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు బ్యాంకు దాటి రైతుల ఖాతాలకు రావడం లేదన్న ఈనాడు కథనంపై మంత్రి స్పందించారు. ఈ విషయమై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితిని ఆయన ఆదేశించారు.

రైతుబంధు నిధులను ఎట్టిపరిస్థితుల్లోనూ బకాయిలకు జమ చేసుకోరాదని మంత్రి స్పష్టం చేశారు. ఎస్ఎల్​బీసీ నిబంధనలను బ్యాంకర్లు అందరూ విధిగా పాటించాలని పేర్కొన్నారు. పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు ద్వారా రైతులకు ఇచ్చే నగదు మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 7, 2023, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.