Gutta Jwala Couple on Green India Challenge: ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, సినీనటడు విష్ణు విశాల్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటి నీరు పోశారు.
![gutta jwala couple sapling plants](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14386558_trees.jpg)
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గుత్తా జ్వాల దంపతులు కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. నటుడు రవితేజ, డైరెక్టర్ మను ఆనంద్కి విష్ణు విశాల్ ఈ ఛాలెంజ్ విసిరారు. అనంతరం వారికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ.. వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.
ఇదీ చదవండి: Lata Mangeshkar: ఏడు దశాబ్దాల ప్రయాణం.. వేల గీతాల నిలయం