ETV Bharat / state

PET'S DHARNA: నియామకాలు చేపడతారా.. కారుణ్య మరణాలకు అనుమతిస్తారా..! - గురుకుల పీఈటీ అభ్యర్థులు

కారుణ్య మరణాలకు అనుమతినివ్వాలంటూ గురుకుల పీఈటీ అభ్యర్థులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఫలితాలు విడుదల చేయలేదని హైదరాబాద్​లోని కమిషన్ ఎదుట వాపోయారు. ఫలితాలను వెంటనే ప్రకటించి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Gurukula pet candidates meet HRC
గురుకుల పీఈటీ అభ్యర్థులు
author img

By

Published : Sep 25, 2021, 7:54 PM IST

గురుకుల పీఈటీ నియామకాల విషయంలో స్టే ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపికైన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హైదరాబాద్​లోని మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. వారం రోజుల్లో న్యాయం జరగకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. పరీక్షలు రాసి నాలుగేళ్లవుతున్నా కూడా ఇప్పటి వరకు ఫలితాలు విడుదల చేయలేదని కమిషన్​కు అభ్యర్థులు వివరించారు. 1:1 ద్వారా గురుకుల పీఈటీ అభ్యర్థుల ఫలితాలను టీఎస్​పీఎస్సీ వెంటనే ప్రకటించి నియామకాలు చేపట్టాలని కోరారు. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చాలా మంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని... నిన్న రాత్రి జనగాం జిల్లా కు చెందిన పీఈటీ అభ్యర్థి శ్రీరామ్ ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వకుండా టీఎస్​పీఎస్సీ జాప్యం చేస్తోందని... 616 పోస్టులకు 1232 మంది అభ్యర్థులు గతంలో సెలక్ట్ అయ్యారని పేర్కొన్నారు. 2018 మేలో అభ్యర్థుల వెరిఫికేషన్ జరిగిందని... 2021లో హైకోర్టు స్టే ఎత్తివేసిందని... కానీ ఇప్పటి వరకు నియామకాలు చెప్పట్టలేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో హెచ్​ఆర్సీ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని వారు వేడుకున్నారు. తమకు వారం రోజుల్లో న్యాయం జరగకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని అభ్యర్థులు హెచ్చరించారు.

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించిన పీఈటీ అభ్యర్థులు

'నాలుగేళ్ల నుంచి నియామకం చేపట్టకుండా జాప్యం చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ నాలుగేళ్లలో పోస్టింగ్​లు లేక మా మిత్రులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిన్ననే జనగామకు చెందిన మా మిత్రుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇలా ఇంకెంత మంది చనిపోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. లేని పక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తాం.'

- సైదులు గౌడ్, తెలంగాణ నిరుద్యోగ, ప్రైవేటు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు

'నాలుగేళ్ల క్రితం మేం పోస్టులకు ఎంపికయ్యాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఇంతవరకు పోస్టింగుల్లేవ్. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో విసిగిపోయాం. నిన్న జనగామకు చెందిన మా మిత్రుడొకరు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. తక్షణమే పీఈటీ అభ్యర్థుల నియామకాలు చేపట్టాలి. లేని పక్షంలో మేం కారుణ్య మరణాలకైనా వెనుకాడం. వీటిలో ఎక్కువశాతం మహిళలమే ఉన్నాం. మహిళలకు ప్రభుత్వమిచ్చే గౌరవమిదేనా.'

- పీఈటీ మహిళా అభ్యర్థులు

ఇదీ చూడండి: YS Sharmila: కేసీఆర్ స్పందించాలంటే.. ఇంకెంతమంది నిరుద్యోగులు చనిపోవాలి: షర్మిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.