బేగంపేటలోని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా హోటల్ మేనేజ్ మెంట్ సంస్థకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన కార్యక్రమంలో లార్జెస్ట్ వంటకాలను రూపొందించినందుకు గాను వారికి ఈ అవార్డు వచ్చింది. మొత్తం 516 వంటకాలను రూపొందించగా... 493 వంటకాలను అందులో ఎంపిక చేసి ఇటీవల గిన్నిస్ బుక్ అవార్డును అందజేశారు. ఇప్పటికే నాలుగు ప్రపంచ రికార్డులను సాధించిన తాము... తాజాగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించటం ఆనందంగా ఉందని సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: నాచారం ఐడీఏలో పేలిన రియాక్టర్.. ఒకరు మృతి