ETV Bharat / state

ప్రైవేట్​ టీచర్లకు సరుకులు పంపిణీ - సికింద్రాబాద్​ వార్తలు

కరోనా కారణంగా పాఠశాలలు తెరవకపోవడం వల్ల ప్రైవేటు టీచర్లు, అధ్యాపకులు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ప్రతీ ఒక్కరు తమకు తోచినంతగా వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉందని కంటోన్మెంట్​ మాజీ ఉపాధ్యక్షులు నర్మదా మల్లిఖార్జున్​ అన్నారు. కంటోన్మెంట్​ ఆక్స్​ఫర్డ్​ పాఠశాల టీచర్లకు ఆయన నిత్యావసర సరుకులు పంచారు.

Groceries Distribution To Private Teachers In Contonment Area
ప్రైవేట్​ టీచర్లకు సరుకులు పంపిణీ
author img

By

Published : Jul 23, 2020, 3:46 PM IST

కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమ నిబంధనల ప్రకారం పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు సర్కారు జీతాలు ఇస్తున్నాయి. కానీ.. ప్రైవేట్​ టీచర్ల పరిస్థితే ఆగమ్య గోచరంగా తయారైంది. అటు బడులు తెరవక.. జీతాలు లేక.. వేరే ఉపాధి మార్గం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇల్లు గడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్​ ఉపాధ్యాయులకు అండగా ఉండాలని పిలుపునిస్తూ.. కంటోన్మెంట్​ మాజీ వైస్​ ప్రెసిడెంట్​ నర్మదా మల్లిఖార్జున్​ ప్రైవేట్​ టీచర్లకు నిత్యావసర సరకులు పంచారు.

సికింద్రాబాద్​ పరిధిలోని కంటోన్మెంట్​ ఆక్స్​ఫర్డ్​ పాఠశాలలో ఆయన ప్రైవేట్​ టీచర్లు, లెక్చరర్లకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్​ టీచర్లు దయనీయ స్థితిలో ఉన్నారని.. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని ఆయన అన్నారు.

ఇవీ చూడండి: 'కరోనాను కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.