లాక్డౌన్ సమయంలో పేద బ్రాహ్మణులను ఆదుకోవాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు శ్రీ గణేష్ ఫౌండేషన్ ఛైర్మన్ గణేష్ తెలిపారు. హైదరాబాద్ కంటోన్మెంట్లోని వివిధ ఆలయాల్లో పనిచేసే బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు అందజేశారు. పేద బ్రాహ్మణ, పండిత కుటుంబాలకు సాయం చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ వాహిని సేవా సంఘం అధ్యక్షుడు రఘు, కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజేశ్వరశర్మ కోరారు.
లాక్డౌన్ వల్ల భక్తులు లేక బ్రాహ్మణ కుటుంబాల జీవనం భారంగా మారిపోయిందన్నారు. ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Mehul Choksi: వేల కోట్లకు ట్రాప్ వేసిన అమ్మాయి!