ETV Bharat / state

అదే నిర్లిప్తత.. మారని గ్రేటర్​ ఓటరు​ తీరు - ghmc civic polls

ఓటుకు పోటెత్తడంలో హైదరాబాదీలు వెనుకబడ్డారు. ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములయ్యే విషయంలో షరా మామూలుగా నిర్లిప్తతను ప్రదర్శించారు. ప్రస్తుతం నమోదైనా పోలింగ్ శాతం..... గత ఎన్నికలకంటే కాస్త మెరుగనిపించినా... అది నామమాత్రమే. సామాజిక మాధ్యమాల్లో ఉత్సాహం చూపే జనం.... సమాజం మధ్యకు వచ్చి గురుతర బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయంలో మిన్నకుండిపోయారు.

ghmc elections
అదే నిర్లిప్తత.. మారని గ్రేటర్​ ఓటరు​ తీరు
author img

By

Published : Dec 2, 2020, 5:38 AM IST

Updated : Dec 2, 2020, 6:35 AM IST

హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొనడంతో శాసనసభ ఎన్నికల కంటే పోలింగ్ భారీగా పెరుగుతుందని అంతా భావించారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఇందుకు భిన్నంగా ఓటర్లు స్పందించారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికల్లో 60 నుంచి 70 శాతం వరకు ఓటింగ్ నమోదవుతోంది. హైదరాబాద్‌లో మాత్రం 50 శాతానికి మించడం లేదు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్‌ను పెంచడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం, బల్దియా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చైతన్య కార్యక్రమాలను నిర్వహించాయి. అయినా ఫలితం కనిపించలేదు. పోలింగ్‌ శాతం కాస్త మాత్రమే పెరిగింది.

జీహెచ్​ఎంసీలో పోలింగ్‌ శాతం అంతగా పెరగకపోవడానికి కారణాలూ కనిపిస్తున్నాయి. అందులో కరోనా ప్రభావం ఒకటి. కొవిడ్‌ సెకండ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని... పెద్దఎత్తున ప్రచారం జరగడంతో ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాల వైపు చూడలేదని చెబుతున్నారు. వరుస సెలవులు, వలసలూ పోలింగ్ శాతాన్ని దెబ్బతీశాయి.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు డుమ్మా..

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు పోలింగ్‌కు డుమ్మా కొట్టినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కలిపి ఆరేడు లక్షల మందికి ఓటుహక్కు ఉన్నట్లు అంచనా. కొవిడ్‌ వల్ల ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించడంతో సగం మంది రాష్ట్ర, రాష్ట్రేతరులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో ఉన్నవారిలోనూ సుమారు 80 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనలేదని అంచనా. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఓటింగ్ శాతం భారీగా పడిపోయింది. కొన్ని రంగాల్లో ఆదివారం నుంచి మంగళవారం వరకు వరుస సెలవులు రావడమూ పోలింగ్‌ శాతంపై ప్రభావం చూపింది.

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్ నుంచి సుమారు 15 లక్షల మంది కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇలా వెళ్లిన వారిలో 50 శాతం మంది తిరిగొచ్చినా మిగిలినవారు అక్కడే ఉండిపోయారు. ఇక్కడికొచ్చిన వారు పూర్తిస్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోకపోవడం వల్ల ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందని చెబుతున్నారు. చాలా కాలనీల్లో పోలింగ్‌ కేంద్రాలు ఉదయం నుంచే ఖాళీగానే కనిపించాయి. ఎక్కువ ప్రాంతాల్లో యువత కంటే.... వృద్ధులే అధికంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. మహానగరంలోని చాలా బస్తీల్లో 60 నుంచి 70శాతం మంది ఓటు వేశారు.

కొందరికి రెండేసి ఓట్లు..

హైదరాబాద్ ఓటర్ల జాబితాలో చేర్పులేగానీ తీసివేతలు ఉండటం లేదు. అనేక మంది చిరునామా మార్పు గురించి దరఖాస్తు చేసినా కొత్త ప్రాంతంలో ఓటుహక్కు కల్పిస్తున్నారు తప్ప... పాత ప్రాంతంలోని ఓటును తీసివేయడం లేదు. దీంతో వాస్తవం కంటే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు కనిపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీకి చెందిన వారిలో పలువురికి ఇక్కడ ఓటు ఉంది. అక్కడా ఉంది. ఇక్కడ ఓటు వేస్తే అక్కడ తీసివేస్తారేమో అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొనడం లేదని చెబుతున్నారు. నగరంలోనే రెండేసి ప్రాంతాల్లో ఓటు ఉన్నవారూ వేలల్లో ఉన్నారు. రీడూప్లికేట్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి అలాంటివి తొలగిస్తే వాస్తవంగా నగరంలో ఓటర్లు ఎంత మంది ఉంటారన్నది తేలుతుంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

పాతబస్తీలోనూ..

ఓటింగ్ తక్కువ నమోదు కావడానికి జీహెచ్‌ఎంసీ అధికారుల వైఫల్యం కూడా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు ఆరేడు నెలల నుంచి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత గడువున్నా పోలింగ్‌ కేంద్రంలో ఎంతమంది ఓటర్లు ఉండాలనే దానిపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. గత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పోలింగ్‌స్టేషన్‌కు వెళితే.. మీ ఓటు ఇక్కడ లేదు. ఆరేడు కిలోమీటర్ల దూరంలోని మరో డివిజన్లో ఉంది అన్న సమాధానం ఎదురైంది. అంత దూరం వెళ్లేక తిరిగి ఇంటికి వెళ్లినవారు వేలల్లోనే ఉన్నారు. ఇక పాతబస్తీలోనూ గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం పెద్దగా పెరగలేదు.

గతం కంటే కాస్త మెరుగు..

గతంలో గ్రేటర్‌లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని గమనిస్తే 2002 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 41.04, తిరిగి 2009లో జరిగిన బల్దియా పోరులో 42.95, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లో 50.86, 2016లో 45.27, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలో 50.86 శాతం నమోదయింది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలో 53 శాతంగా నమోదయింది. ప్రస్తుతం 46.6 పోలింగ్‌ శాతం నమోదయినట్లు ఎన్నికల అధికారి లోకేశ్​కుమార్​ తెలిపారు.

ఇవీచూడండి: ఓటెందుకు సోదరా... ఆరు కొట్టింది పోదాం పదరా...!

Last Updated : Dec 2, 2020, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.