ETV Bharat / state

పీపుల్స్ ప్లాజా వేదికగా గ్రాండ్ నర్సరీ మేళా! - తెలంగాణ వార్తలు

ఈనెల 28 నుంచి గ్రాండ్ నర్సరీ మేళా-2021 జరగనుంది. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్​లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేయనున్న అఖిల భారత ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శనలో 125 పైగా స్టాళ్లు ఏర్పాటు చేయబోతున్నామని తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ సంస్థ ప్రకటించింది.

grand-nursery-mela-on-this-month-at-peoples-plaza-necklace-road-in-hyderabad
పీపుల్స్ ప్లాజా వేదికగా గ్రాండ్ నర్సరీ మేళా!
author img

By

Published : Jan 25, 2021, 3:51 PM IST

జనవరి 28 నుంచి ఐదు రోజులపాటు 9వ గ్రాండ్ నర్సరీ మేళా-2021 జరగనున్నట్లు తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ సంస్థ అధ్యక్షుడు ఖలీద్ అహ్మద్ తెలిపారు. సికింద్రాబాద్ మినిస్టర్స్ రోడ్‌ భరణి కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ నిర్వాహకులతో కలిసి ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్​లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేయనున్న అఖిల భారత ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శనలో 125 పైగా స్టాళ్లు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాలు... ప్రత్యేకించి రాజధాని జంట నగరవాసుల సౌకర్యార్థం నాణ్యమైన దేశవాళీ, సంకర విత్తనాలే కాకుండా అందమైన పూలు, కూరగాయల మొక్కలు, నారు, అలంకరణ మొక్కలు, కుండీలు, పిచికారీ యంత్రాలు, పనిముట్లు, సేంద్రీయ ఉత్పత్తులు ప్రదర్శించనున్నట్లు చెప్పారు. దేశంలో ఉద్యాన రంగంలో వస్తున్న కొత్త పోకడలు, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు, వర్టికల్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్, లాండ్ స్కేప్, హైడ్రోపొనిక్స్ ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఈ మేళా సందర్శించి అవగాహన ఏర్పరచుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా "గ్రాండ్ నర్సరీ మేళా" బ్రోచర్లు విడుదల చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో విత్తన రాయితీ పూర్తిగా కనుమరుగైంది: జీవన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.