ETV Bharat / state

రేపటి నుంచి పట్టభద్రుల కోటా ఎన్నికల ఓటర్ల నమోదు - గ్రాడ్యుయేట్​ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం అక్టోబర్​ ఒకటి నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ స్థానంతో పాటు నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎన్నికల కోసం ఓటుహక్కు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల సమయంలో ఓటుహక్కు ఉన్నవారు మళ్లీ నమోదు చేసుకోవాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది.

graduate elections
రేపటి నుంచి పట్టభద్రుల కోటా ఎన్నికల ఓటర్ల నమోదు
author img

By

Published : Sep 30, 2020, 10:38 PM IST

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానాల్లో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ అక్టోబర్​ ఒకటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఓటరు నమోదు కోసం గురువారం.. ఇవాళ రిటర్నింగ్ అధికారులు నోటీసు జారీచేస్తారు. అక్టోబర్​ ఆరు వరకు ఓటరునమోదు కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు.

డినావా విధానంలో..

శాసనమండలి ఎన్నికలు జరిగే ప్రతిసారి డినోవా విధానంలో కొత్త ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు. అంటే ఎన్నిక జరిగినప్పుడల్లా ఓటర్ల జాబితా మొత్తాన్ని తయారు చేయాల్సిందే. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటువేసిన వారు.. మళ్లీ తమ ఓటుహక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 2020 నవంబర్ ఒకటి అర్హత తేదీతో ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నారు. నిబంధనల ప్రకారం అర్హత తేదీకి మూడేళ్లు ముందు పట్టభద్రులై ఉండాలి. అంటే 2017 నవంబర్ ఒకటో తేదీ నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తైన వారు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.

ఏయే పత్రాలు కావాలి..

పట్టభద్రులుగా నిరూపించుకునే ధ్రువపత్రం, ఆధార్ కార్డు లేదా నివాస ధృవీకరణ పత్రం నకళ్లను గెజిటెడ్ అధికారి ద్వారా అటెస్టేషన్ చేయించి దరఖాస్తుతో పాటు జతపర్చాలి. సాధారణ ఎన్నికల ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈఆర్వో, ఏఈఆర్వో కార్యాలాయాలు, పోలింగ్ కేంద్రాల వద్ద నియమించిన అధికారుల వద్ద ఓటరు నమోదు కోసం ఫారం 18ని సమర్పించవచ్చు. ఆన్​లైన్లోనూ ceotelangana.nic.in ద్వారా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఇవీచూడండి: పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.