ETV Bharat / state

ఎన్నికల ప్రచారం: విమర్శలతో విరుచుకుపడుతున్న నేతలు - telangana latest news

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కాకపుట్టిస్తోంది. పరస్పర సవాళ్లతో ప్రధాన పార్టీల నాయకులు విరుచుకుపడుతున్నారు. అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు అభ్యర్థిస్తున్న ముఖ్యనేతలు.. ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

GRADUATE MLC CANDIDATES ELECTION CAMPAIGN IN CONSTITUENCIES IN TELANGANA
ఎన్నికల ప్రచారం: విమర్శలతో విరుచుకుపడుతున్న నేతలు
author img

By

Published : Mar 1, 2021, 7:58 PM IST

ఎన్నికల ప్రచారం: విమర్శలతో విరుచుకుపడుతున్న నేతలు

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పార్టీలన్నీ దూసుకుపోతున్నాయి. ముఖ్య నేతల పర్యటనలతో ప్రచారం జోరందుకుంటోంది. విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఒకసారి ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలని రంగారెడ్డి-మహబూబ్​నగర్-హైదరాబాద్ తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​తో కలిసి కేబీఆర్​ పార్కులో ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. హైదరాబాద్ కూకట్​పల్లిలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచార సభలో అభ్యర్థి వాణీదేవితో కలిసి మంత్రి హరీశ్​రావు పాల్గొన్నారు.

భాజపా దూకుడు..

భాజపా సైతం ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. పార్టీ అభ్యర్థి రాంచందర్​రావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రచారం చేశారు. ఉద్యోగాల లెక్కల విషయంలో తెరాస అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్-మహబూబ్​నగర్​-రంగారెడ్డి స్థానానికి సంబంధించిన ప్రచారంలో భాగంగా మహబూబ్​నగర్​లో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఓట్లు అభ్యర్థించారు. ప్రజలు కేసీఆర్ కుటుంబపాలన పట్ల విసుగు చెంది మార్పు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు.

తీవ్రంగా శ్రమిస్తోన్న కాంగ్రెస్..​

ఎమ్మెల్సీ విజయం కోసం కాంగ్రెస్​ పార్టీ సైతం తీవ్రంగా శ్రమిస్తోంది. పార్టీ అనుబంధ సంఘాలతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి సమావేశమై మార్గనిర్దేశనం చేశారు. ఉద్యోగాల కల్పనలో తెరాస, భాజపా పూర్తిగా విఫలమయ్యాయన్న ఉత్తమ్.. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెరాస, భాజపాలకు పట్టభద్ర ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

మరోవైపు స్వతంత్రులు, పార్టీల స్థానిక నేతలూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు.

ఇదీ చూడండి: 'రాంచందర్​రావు.. ప్రశ్నించే గొంతుకయితే.. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.