ETV Bharat / state

నిరుద్యోగులకు గుడ్​న్యూస్.. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి గ్రీన్​సిగ్నల్​ - Group 1 2 Notification in Telangana

Group 4
Group 4
author img

By

Published : Nov 25, 2022, 6:58 PM IST

Updated : Nov 26, 2022, 6:45 AM IST

18:52 November 25

నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

TSPSC Latest Notifications: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వేలమంది నిరుద్యోగులకు రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా వీటిని భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 25 శాఖల్లోని 91 విభాగాల్లో ఖాళీగా ఉన్న 6,859 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు పురపాలక శాఖలో 1,862 వార్డు అధికారుల పోస్టులు, ఆర్థికశాఖ, పురపాలకశాఖలో 429 జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు, ఆడిట్‌శాఖలో 18 మంది జూనియర్‌ ఆడిటర్ల నియామకానికి ఆర్థికశాఖ అనుమతించింది. సదరు ఉద్యోగాల భర్తీకి వీలుగా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Group 4 notifications : జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి వీలుగా సంబంధిత శాఖలు ఖాళీల వివరాలు, అర్హతలు, రోస్టర్‌ పాయింట్లు, లోకల్‌ క్యాడర్‌ వంటి వివరాలను టీఎస్‌పీఎస్సీకి అందించాలని రామకృష్ణారావు సూచించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆర్థికశాఖ ఉత్తర్వులను మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌లోపెట్టి ఆశావహులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వారి ఆకాంక్షలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నెరవేరుస్తున్నారు. ప్రజల సేవే లక్ష్యంగా సీఎం భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి అనుమతించి ఖాళీలను భర్తీ చేస్తున్నారు’’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 9168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆర్థికశాఖ ఉత్తర్వులను మంత్రి ట్విటర్‌లోపెట్టి ఆశావహులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఫిబ్రవరి 26న డీఏఓ పోస్టులకు రాతపరీక్ష.. డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్‌ అకౌంట్స్‌ విభాగంలో డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారులు (వర్క్స్‌) గ్రేడ్‌-2 పోస్టులకు 2023 ఫిబ్రవరి 26న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షను ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రవేశపత్రాలను పరీక్షతేదీకి వారం రోజుల ముందు వెబ్‌సైట్లో పొందుపరచనున్నట్లు వెల్లడించింది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 26, 2022, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.