ETV Bharat / state

PRC: వేతన బకాయిలను వాయిదా పద్ధతిలో చెల్లించాలి: ఉద్యోగులు - 30 శాతం ఫిట్​మెంట్​

వేతన బకాయిలను వాయిదా పద్ధతిలో చెల్లించాలని ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది. ప్రస్తుత పీఆర్సీ కాలపరిమితి ముగిసేలోగా వాయిదాల్లో చెల్లించాలని ఉద్యోగులు కోరారు. ఆర్థిక మంత్రి హరీశ్​రావును కలిసి మెమొరాండంను సమర్పించారు.

govt employees and pensioners requested govt to pay arrears in installments
వేతన బకాయిలను వాయిదా పద్ధతిలో చెల్లించాలి: ఉద్యోగులు
author img

By

Published : Jun 12, 2021, 7:37 PM IST

పీఆర్సీ అమలు దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వాయిదా పద్ధతిలో ఇవ్వాలని ఉద్యోగులు, పెన్షనర్లు, ఒప్పంద ఉద్యోగుల ఐక్యవేదిక ప్రభుత్వానికి విన్నవించింది. ఈమేరకు ఆర్థికమంత్రి హరీశ్​రావును కలిసి మెమొరండంను సమర్పించారు. ఇటీవల సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం... ప్రభుత్వ ఉద్యోగులకు, ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందికి 30 శాతం ఫిట్​మెంట్​ అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఏప్రిల్​ 1, 2020 నుంచి మార్చి 31, 2021 వరకు చెల్లించాల్సిన 12 నెలల బకాయిలను ఉద్యోగ విరమణ సందర్భంలో చెల్లిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఉద్యోగ విరమణ వయస్సు 3 ఏళ్లు పెంచి 61 సంవత్సరాలు చేసినందున, ఇప్పుడు సర్వీసులో ఉన్న ఉద్యోగులు 3 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతారు. బకాయిల కోసం అంత కాలం ఎదురు చూడాల్సిరావటం సమంజసం కాదనీ... పునరాలోచన చేయాలని ఉద్యోగులు, పెన్షనర్ల ఐక్యవేదిక ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. పీఆర్సీ కాలపరిమితి ముగిసేలోగా వాయిదా పద్ధతిలో చెల్లించాలని విన్నవించింది. అలవెన్సుల జీవోలనూ వెంటనే విడుదల చేసి నూతన వేతనాలను సంపూర్ణంగా అందించాలని ఉద్యోగులు కోరారు.

ఇదీ చూడండి: Etala: 'హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.