గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణకుమారి(80) కన్నుమూశారు. నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణకుమారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. అనంతరం కృష్ణకుమారి భౌతికకాయాన్ని రాజ్‌భవన్‌కు తీసుకువచ్చారు. కృష్ణకుమారి పార్థివదేహానికి పులువురు అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లి రాజ్ భవన్‌కు చేరుకొని... భౌతిక కాయానికి పూలమాల వేశారు. అనంతరం నివాళులు అర్పించి... గవర్నర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా కృష్ణకుమారి పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
గవర్నర్ తమిళిసై తల్లి మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేసీఆర్‌తో పాటు తెదేపా అధినేత చంద్రబాబు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి... కృష్ణకుమారి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తల్లి మరణంతో శోక సముద్రంలో ఉన్న గవర్నర్ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. కృష్ణ కుమారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
బండి సంజయ్, రేవంత్‌రెడ్డి సంతాపం..
గవర్నర్ మాతృమూర్తి మృతి పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చూడండి: GOVERNOR TAMILISAI: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృవియోగం