ETV Bharat / state

GOVERNOR TAMILISAI: 75వ స్వాతంత్య్ర దినోత్సవం... దేశ చరిత్రలో గొప్పదినం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై(GOVERNOR TAMILISAI) శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ చరిత్రలో ఇది గొప్పదినమని అన్నారు. అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించేలా పాటుపడదామని కోరారు.

governor tamilisai wishes, governor independence day wishes
గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు, గవర్నర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
author img

By

Published : Aug 14, 2021, 3:24 PM IST

రాష్ట్ర ప్రజలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై(GOVERNOR TAMILISAI) సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ పేరుతో జరుపుకుంటున్న 75వ స్వాతంత్య్ర దినోత్సవం మనదేశ చరిత్రలో గొప్పదినమని అన్నారు. ఎందరో మహానుభావుల వెలకట్టలేని త్యాగాలు, అవిశ్రాంత పోరాటంతో వలసపాలన నుంచి విముక్తులమై స్వాతంత్య్ర పొందామని గుర్తుచేశారు. అనంతరం భారతదేశం అన్ని రంగాల్లో ఎంతగానో అభివృద్ధి సాదించిందన్న గవర్నర్... మనమందరం ఆ ఫలాలను అనుభవిస్తున్నామని అన్నారు.

స్వాతంత్య్ర సమరయోధులకు ఘనంగా నివాళి అర్పించిన తమిళిసై... వారందరి త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ దేశాన్ని మరింత బలోపేతం చేద్దామని తీర్మానిద్దామని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని చాటేలే అన్ని రంగాల్లో దేశం స్వయం సమృద్ధి కోసం పాటుపడదామని సూచించారు. కొవిడ్ నిబంధనలకు లోబడి దేశభక్తి భావంతో ఉత్సవాలు నిర్వహించుకుందామని కోరారు.

ఇదీ చదవండి: 900 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.. పోలీసుల అదుపులో ఐదుగురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.