ETV Bharat / state

Governor Tamilisai Latest Comments : 'నేను ఎవరినీ తప్పుబట్టేందుకు ఉస్మానియాకు రాలేదు' - Tamilisai Soundara Rajan latest news

Governor Tamilisai Soundararajan visited Osmania Hospital : ఉస్మానియా ఆసుపత్రిలో భారీగా పెరిగిన రోగులతో కిక్కిరిసి, ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి నెలకొందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఆసుపత్రిలో ఒక్కో బెడ్ మీద ఇద్దరు, ముగ్గురిని ఉంచి సేవలు అందించాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన ఆమె.. కొత్త భవంతి నిర్మాణానికి న్యాయపరమైన సమస్యలు ఉంటే.. ప్రత్యామ్నాయ పరిస్థితులు చూసి కొత్త భవనం కట్టాలని సూచించారు.

Governor Tamilisai Soundararajan
Governor Tamilisai Soundararajan
author img

By

Published : Jul 3, 2023, 5:27 PM IST

Updated : Jul 3, 2023, 6:56 PM IST

Tamilisai Soundararajan visited Osmania Hospital : హైదరాబాద్​లోని ఉస్మానియా ఆసుపత్రిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్శించారు. ఆసుపత్రిలో పరిస్థితులను చూసి ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత భవన పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పాత భవంతిలో రోగులు లేరని వైద్యులు గవర్నర్‌కు చెప్పారు. పెరిగిన రోగులకు బెడ్స్ ఏర్పాటుపై గవర్నర్‌ ఆరా తీశారు. మంత్రి హరీశ్‌రావుతో సమీక్ష దృష్ట్యా సూపరింటెండెంట్‌ నాగేంద్ర అందుబాటులో లేరు. అనంతరం మాట్లాడిన ఆమె.. ఆసుపత్రిలో ఒక్కో బెడ్ మీద ఇద్దరు నుంచి ముగ్గురిని ఉంచి సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆసుపత్రిలోని శౌచాలయాలకు సరైన తలుపులు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. అలాగే సిబ్బంది కూర్చోవడానికి సరైన ప్రదేశం లేదని తెలిపారు. సరైన స్థలం లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేసిన ఆమె.. కొత్త భవనం కట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కొత్త భవంతి నిర్మాణానికి లీగల్ సమస్యలు ఉంటే ప్రత్యామ్నాయ పరిస్థితులు చూడాలని పేర్కొన్నారు. ఉస్మానియాకు కొత్తగా 3000 పడకలు అవసరమని సూచించారు.

"ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించాను. ఆసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడి రోగులు గాయపడుతున్నారు. ఆసుపత్రి విషయంలో చొరవ చూపిన కోర్టును అభినందిస్తున్నాను. రోజుకు 2000 మంది ఔట్‌ పేషెంట్లు వస్తున్నారు. రోజూ 200 వరకూ సర్జరీలు చేస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవనం కట్టి వందల ఏళ్లవుతోంది. ఉస్మానియా ఆసుపత్రి కోసం కొత్త భవనం కట్టాల్సిన అవసరముంది. జనరల్‌ వార్డులో కొన్ని ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి. ఎండ వేడి తట్టుకోలేకపోతున్నామని రోగులు చెప్పారు. నేను ఎవరినీ తప్పుబట్టేందుకు ఉస్మానియా ఆసుపత్రికి రాలేదు. వైద్యులు, సిబ్బంది ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నారు." - తమిళిసై సౌందర రాజన్, గవర్నర్

పర్యటనలో రాజకీయ ఉద్యేశం లేదు..: ఉస్మానియా ఆసుపత్రి పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని గవర్నర్‌ తమిళిసై స్పష్టం చేశారు. రోగులకు మంచి జరగాలనేదే తన ఉద్దేశమన్న గవర్నర్‌.. ప్రభుత్వం లీగల్ ఇష్యూ అని చెప్పి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. త్వరగా భవనం కట్టాలనడం రాజకీయం అవుతుందా అని ప్రశ్నించారు. రాజకీయ నేతలా మాట్లాడుతున్నానని అనడం సరికాదన్నారు. తనకు సమస్యల గురించి చెప్పే హక్కు లేదా అని ప్రశ్నించిన గవర్నర్‌.. తనను ప్రశ్నించడానికి బదులుగా సమస్యకు పరిష్కారం చూపితే బాగుంటుందని హితవు పలికారు.

'నేను ఎవరినీ తప్పుబట్టేందుకు ఉస్మానియాకు రాలేదు'

Harishrao review on Osmania Hospital : మరోవైపు ఉస్మానియా ఆసుపత్రి అభివృద్ధిపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి అభివృద్ధి, సంబంధిత అంశాలపై అధికారులు, వైద్యులతో చర్చించారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం అంశం తెరపైకి వచ్చినట్లు సమాచారం. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 3, 2023, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.