ETV Bharat / state

GOVERNOR TAMILISAI: గవర్నర్‌ తమిళిసైకు మాతృవియోగం.. ప్రముఖుల సంతాపం - తెలంగాణ వార్తలు

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాతృమూర్తి కృష్ణకుమారి(80) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమె... ఈ రోజు తెల్లవారుజామున చికిత్సపొందుతూ మృతి చెందారు.

governor-tamilisai-soundararajan-mother-died
గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృవియోగం
author img

By

Published : Aug 18, 2021, 8:55 AM IST

Updated : Aug 18, 2021, 11:27 AM IST

గవర్నర్ తమిళసై సౌందరరాజన్​కు​ మాతృ వియోగం కలిగింది. తమిళిసై తల్లి కృష్ణకుమారి(80) మృతి చెందారు. అనారోగ్యంతో బాధ పడుతున్న కృష్ణకుమారిని రెండు రోజుల క్రితం సోమజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆమె ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు మృతిచెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు కృష్ణకుమారి పార్థివదేహాన్ని రాజ్ భవన్ నుంచి చెన్నైకు తరలించి... అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృవియోగం

కృష్ణకుమారి భౌతికకాయాన్ని రాజ్‌భవన్​కు తీసుకువచ్చారు. కృష్ణకుమారి పార్థివదేహానికి పులువురు అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లి రాజ్​ భవన్​కు చేరుకొని... భౌతిక కాయానికి పూలమాల వేశారు. అనంతరం నివాళులు అర్పించి... గవర్నర్​ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా కృష్ణకుమారి పార్థివదేహానికి నివాళులు అర్పించారు.

పలువురు ప్రముఖుల సంతాపం..

గవర్నర్‌ తమిళిసై తల్లి మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేసీఆర్‌తో పాటు తెదేపా అధినేత చంద్రబాబు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కృష్ణకుమారి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తల్లి మరణంతో శోక సముద్రంలో ఉన్న గవర్నర్ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. కృష్ణ కుమారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

బండి సంజయ్, రేవంత్‌రెడ్డి సంతాపం..

గవర్నర్‌ మాతృమూర్తి మృతి పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నా ప్రియమైన తల్లిని కోల్పోయాను..

  • With a very heavy heart I wish to inform that I lost my lovable mother early morning today.
    We are bringing her to Saligramam, Chennai residence by evening flight for final respects . pic.twitter.com/itJaLq8SDS

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ రోజు ఉదయాన్నే తన ప్రియమైన తల్లిని కోల్పోయానని గవర్నర్ తమిళిసై ట్విట్టర్ వేదికగా తెలిపారు. అంత్యక్రియల కోసం కృష్ణకుమారి పార్థివ దేహాన్ని సాయంత్రం విమానంలో చెన్నైలోని సాలిగ్రామానికి తీసుకెళ్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: 'ఓపెన్‌ బుక్‌' విధానంతో బట్టీ పద్ధతికి వీడ్కోలు!

Last Updated : Aug 18, 2021, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.