తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే ఉత్సవాలను ప్రజలు దశాబ్దాలుగా జరుపుకుంటున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. అమ్మవారి ఆలయాల్లో బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర ప్రజలకు బోనాల వేడుక శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులు తమ ఇళ్లలోనే బోనాలు జరుపుకోవాలని తమిళిసై కోరారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి భక్తులు నడుచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీచూడండి: నడిసంద్రంలో 'కరోనా'.. అంతుచిక్కని ప్రశ్నలు!