Constitution day celebrations in Raj bhavan: ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని గవర్నర్ తమిళిసై కోరారు. కరోనా మహమ్మారి ఇంకా పోలేదని... అందరూ భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో నిర్వహించిన 72వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్... ప్రజలంతా రెండు డోసులు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
సవాళ్లను అధిగమించి..
దేశానికి అంబేడ్కర్ అద్భుత రాజ్యాంగం(india constitution day 2021)అందించారని గవర్నర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కోసం రాజ్యాంగ రచన కమిటీ ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. 7 దశాబ్దాలుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దృఢంగా నిలిచిందని పేర్కొన్నారు.
టీకా మస్ట్
కరోనాను ఎదుర్కొవడానికి అందరూ టీకా తీసుకోవాలని చెప్పిన గవర్నర్(tamilisai soundararajan speech)... వ్యాక్సిన్‌పై ఇంకా కొందరికి అపోహలు ఉన్నాయని అన్నారు. టీకా తీసుకుంటే కొవిడ్ నుంచి మరింత రక్షణ పొందవచ్చని చెప్పారు. టీకా పొందినవారికి ఇన్‌ఫెక్షన్ సోకితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని... ఐసీయూలో చేరేవారిలో 99 శాతం మంది టీకా తీసుకోనివారేనని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇదీ చదవండి: Constitution Day 2021: ఆర్డినెన్సులు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు!