తెలంగాణలో ఎరుకల కులస్తులు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అత్యంత వెనుకబడి ఉన్నారని ఎరుకల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లీశ్వరీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రత్యక్ష ఎన్నికల్లో తమ కులానికి ఏ రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో త్వరలో భర్తీ చేయబోయే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని తమ కులానికే కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఎరుకల జాతి రాజకీయ అభివృద్ధి కోసం..
ఈ మేరకు సీఎం కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు మల్లీశ్వరీ స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో వెనుకబడిన ఎరుకల జాతిని రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు గవర్నర్ కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలన్నారు. గతంలో గవర్నర్ కోటాలో ఎస్టీల్లోని లంబాడీలకు స్థానం కల్పించారని... ఈసారి ఆ స్థానాన్ని ఎరుకల సామాజికవర్గానికి ఇవ్వాలని మల్లీశ్వీరి పేర్కొన్నారు.
ఇవీ చూడండి : విశ్వకర్మలకు అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నాం: శ్రీనివాస్ గౌడ్